Grid View
List View
Reposts
  • sindhe 11w

    జై భీం జై భీం అంటూ జెండా పాతెద్దాము
    జై భీం జై భీం అంటూ గుండాలను తరిమికోడదాం
    జై భీం జై భీం అంటూ జగతికి స్పూర్తి గా నిలుద్దాం
    జై భీం జై భీం అంటూ ప్రగతి వైపు పరుగులు తీద్దాం

    జై భీం జై భీం జై భీం
    అది పదము కాదు ఆయుధమ్
    జై భీం జై భీం జై భీం
    అది దేశాన్ని రక్షించే రక్షకకవచమ్

    జై భీం అంటే మతము కాదు
    జై భీం అంటే మనమే రా
    జై భీం అంటే కులం కాదు
    జై భీం అంటే ప్రశ్నించే గలము రా
    జై భీం అంటే కాంతి ,జై భీం అంటే ప్రేమ
    జై భీం అంటే అన్యాయాన్ని ఎదిరించే ధీమా

    జై భీం జై భీం జై భీం
    అది పదము కాదు ఆయుధమ్
    జై భీం జై భీం జై భీం
    అది దేశాన్ని రక్షించే రక్షకకవచమ్

    జై భీం అంటే హక్కులకు
    ఆయువు పోసినా సంజీవని రా
    జై భీం అంటే నలుదిక్కులను
    ఏకం చేసినా జ్ణాణి రా
    జై భీం అంటే రెపరెపలాడే జెండా రా
    జై భీం అంటే ప్రతి పౌరుడికి అండ రా

    జై భీం జై భీం జై భీం
    అది పదము కాదు ఆయుధమ్
    జై భీం జై భీం జై భీం
    అది దేశాన్ని రక్షించే రక్షకకవచమ్
    ✍️ Srikanth Sindhe

  • sindhe 12w

    మతము మతము అంటూ మనిషి
    మద గజం లెక్క తయారు అయితివి
    మతము మాయలో పడి మనిషి
    బతుకును సతమతం చేసుకుంటివి
    మతం అన్నా భావం మరవర మనిషి
    మనమంతా ఒకటే అని మెలగర మనిషి..

    మతము మతము అంటూ మనిషి
    మద గజం లెక్క తయారు అయితివి
    మతము మాయలో పడి మనిషి
    బతుకును సతమతం చేసుకుంటివి ..!

    రెచ్చగొట్టే నాయకుల మాటలు
    తూటాలై నిన్ను రక్తపు మడుగులో తడిపినాయి
    కనబడని మతపు పిచ్చి
    ఖైధిని చేసి కారగారంలో బంధి చేసినది
    గోడవల వలలో పడి మనిషి
    ఒడ్డున పడ్డా చేప లెక్క గిలగిల కొట్టుకుంటువి

    మతము మతము అంటూ మనిషి
    మద గజం లెక్క తయారు అయితివి
    మతము మాయలో పడి మనిషి
    బతుకును సతమతం చేసుకుంటివి ..!

    ఏ మత గ్రంథంలో లేదు రా
    మనిషి ని మనిషి సంపుకోమని
    ఏ దేవుడు కూడా చెప్పలేడు రా
    రాగద్వేషాలతో రాళ్ళు రువ్వుకొమ్మని
    నిలో మతమనే మృగంను సంపుకోరా మనిషి
    ఐక్యమత్యంతో హాయిగా బతుకురా మనిషి

    మతము మతము అంటూ మనిషి
    మద గజం లెక్క తయారు అయితివి
    మతము మాయలో పడి మనిషి
    బతుకును సతమతం చేసుకుంటివి ..!
    ✍️ Srikanth Sindhe

  • sindhe 16w

    కంటికి కునుకు లేదా యే
    కన్నబిడ్డ లెక్క చూసుకున్నా పంట పాడవుతుంటే
    కన్నీరె నీకు నేస్తం ఆయే
    కాలం కన్నెర్ర చేసి నీ కడుపు కొడుతుంటే
    సైక్లోన్ ని పాలిట సైతాన్ లా మారే
    సజావుగా సాగే ని బతుకును సతమతము చేసె

    రైతన్న ఓ రైతన్న
    దేశానికి వెన్నెముక అయినా నిన్ను వెన్నుపోటు పొడిచే ఈ రాకాసి వాన
    రైతన్న ఓ రైతన్న
    రాజు లెక్క ఉండే నిన్ను రొడ్డుపైకి లాగే ఈ రక్షసపు వాన
    ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ..!

    పసిడి లెక్క ఉన్నా పత్తి పంట
    పురుగులు పట్టి పశువుల పాలయ్యెనే
    సుడ సక్కగా ఉన్న సోయబీను
    విషపు వానకు విచిత్రంగా తయారయ్యెనే
    చేతికి వచ్చిన మొక్క జొన్న పంట చేజారి పోయెనె
    చేతికి వచ్చిన మొక్క జొన్న పంట చేజారి పోయెనె
    చిరునవ్వులున్నా ని మొఖంలో విషాదం నింపేనె

    రైతన్న ఓ రైతన్న
    దేశానికి వెన్నెముక అయినా నిన్ను వెన్నుపోటు పొడిచే ఈ రాకాసి వాన
    రైతన్న ఓ రైతన్న
    రాజు లెక్క ఉండే నిన్ను రొడ్డుపైకి లాగే ఈ రక్షసపు వాన
    ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ..!

    పొట్టకు వచ్చిన వరి పంటను
    పొట్టెలును మింగిన పులి లా ఈ సైక్లోన్ మింగేనె
    కష్టాలు తీరుస్తుందన్నా పసుపు పంట
    దుంప కుళ్ళు రోగం పడి దుఃఖం ను మిగిల్చేనె
    సముద్రం అంతా పెట్టుబడి పెట్టిన
    సముద్రం అంతా పెట్టుబడి పెట్టిన
    నది అంతా రాబడి వచ్చి నష్టాలే మిగిలేనె
    ని బతుకు నరకం అయ్యేనె

    రైతన్న ఓ రైతన్న
    దేశానికి వెన్నెముక అయినా నిన్ను వెన్నుపోటు పొడిచే ఈ రాకాసి వాన
    రైతన్న ఓ రైతన్న
    రాజు లెక్క ఉండే నిన్ను రొడ్డుపైకి లాగే ఈ రక్షసపు వాన
    ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ..!
    ✍️ Srikanth Sindhe

  • sindhe 16w

    బాలామణి ఓ బాలామణి
    ని ప్రేమ కోమలో పడ్డా పిల్లగాన్ని
    బాలామణి ఓ బాలామణి
    ని పేరు మీదా రాస్తానే మగాణి తోటని
    పట్టుచీర కట్టుకున్న బాలామణి
    పట్టుమని దోచావే నా మనసుని
    గలగల గజ్జలు కట్టిన బాలమణి
    ని గుండెల్లో చోటిస్తే కడతానే ప్రేమ గుడిని..

    బాలామణి ఓ బాలామణి
    ని ప్రేమ కోమలో పడ్డ పిల్లాగాన్ని
    బాలామణి ఓ బాలామణి
    ని పేరు మీద రాస్తానే మగాణి తోటని..!

    చుక్క లెక్క ఉన్నావే బాలమణి
    సుక్క తాగకుండా ఎక్కించావే మత్తుని
    చందమామ అందం ఉన్నా బాలమణి
    ఈ లోకానికి చేస్తా నిన్ను మహరాణిని
    నువ్వు ఒప్పుకొంటే అవుతాను కాళిదాసుని
    నువ్వు ఒప్పుకొంటే అవుతాను కాళిదాసుని
    కాదంటే అవుతా మరో దేవదాసు ని..

    బాలామణి ఓ బాలామణి
    ని ప్రేమ కోమలో పడ్డ పిల్లాగాన్ని
    బాలామణి ఓ బాలామణి
    ని పేరు మీద రాస్తానే మగాణి తోటని..!

    ఎడుకోండలెక్కనే బాలమణి
    నితో ఎడు ఆడుగులు నడవాలని
    ఎడు వారాల నగలు తెచ్చా బాలమణి
    ఎన్ని జన్మలకైనా నిన్ను చేసుకుంటా నా ఆలి ని
    ఏడు ఖండాలు తిరిగినా బాలమణి
    ఏడు ఖండాలు తిరిగినా బాలమణి
    ఎడ చూడవు నా లాంటి పిల్లగాన్ని ..

    బాలామణి ఓ బాలామణి
    ని ప్రేమ కోమలో పడ్డ పిల్లాగాన్ని
    బాలామణి ఓ బాలామణి
    ని పేరు మీద రాస్తానే నా మగాణి తోటని..!

    బాలరాజు ఓ బాలరాజు
    నువ్వే నా గుండె కోటకి రాజు
    బాలరాజు ఓ బాలరాజు
    నన్ను మనువాడి తీసుకపోరా ఈ రోజు ..!

  • sindhe 16w

    బాలామణి ఓ బాలామణి
    ని ప్రేమ కోమలో పడ్డా పిల్లగాన్ని
    బాలామణి ఓ బాలామణి
    ని పేరు మీదా రాస్తానే మగాణి తోటని
    పట్టుచీర కట్టుకున్న బాలామణి
    పట్టుమని దోచావే నా మనసుని
    గలగల గజ్జలు కట్టిన బాలమణి
    ని గుండెల్లో చోటిస్తే కడతానే ప్రేమ గుడిని..

    బాలామణి ఓ బాలామణి
    ని ప్రేమ కోమలో పడ్డ పిల్లాగాన్ని
    బాలామణి ఓ బాలామణి
    ని పేరు మీద రాస్తానే మగాణి తోటని..!

    చుక్క లెక్క ఉన్నావే బాలమణి
    సుక్క తాగకుండా ఎక్కించావే మత్తుని
    చందమామ అందం ఉన్నా బాలమణి
    ఈ లోకానికి చేస్తా నిన్ను మహరాణిని
    నువ్వు ఒప్పుకొంటే అవుతాను కాళిదాసుని
    నువ్వు ఒప్పుకొంటే అవుతాను కాళిదాసుని
    కాదంటే అవుతా మరో దేవదాసు ని..

    బాలామణి ఓ బాలామణి
    ని ప్రేమ కోమలో పడ్డ పిల్లాగాన్ని
    బాలామణి ఓ బాలామణి
    ని పేరు మీద రాస్తానే మగాణి తోటని..!

    ఎడుకోండలెక్కనే బాలమణి
    నితో ఎడు ఆడుగులు నడవాలని
    ఎడు వారాల నగలు తెచ్చా బాలమణి
    ఎన్ని జన్మలకైనా నిన్ను చేసుకుంటా నా ఆలి ని
    ఏడు ఖండాలు తిరిగినా బాలమణి
    ఏడు ఖండాలు తిరిగినా బాలమణి
    ఎడ చూడవు నా లాంటి పిల్లగాన్ని ..

    బాలామణి ఓ బాలామణి
    ని ప్రేమ కోమలో పడ్డ పిల్లాగాన్ని
    బాలామణి ఓ బాలామణి
    ని పేరు మీద రాస్తానే నా మగాణి తోటని..!

    బాలరాజు ఓ బాలరాజు
    నువ్వే నా గుండె కోటకి రాజు
    బాలరాజు ఓ బాలరాజు
    నన్ను మనువాడి తీసుకపోరా ఈ రోజు ..!

  • sindhe 16w

    రంగు రంగు పూలు తేచ్చి
    పువ్వు మీద పువ్వు పేర్చి
    బతుకమ్మను ముస్తాబు చేసినారురో
    బంగారు బొమ్మ లెక్క చూసినారురో //2//..!
    కొత్త కొత్త చీర కట్టి
    కొలలు చేత పట్టి //2//
    బతుకమ్మ సుట్టు గంతులేసినారురో
    బాధలన్ని మరిచి సేదదీరినారురో//2// ..!
    పల్లేంత పండగలో మునిగితేలెరో
    బతుకమ్మ అండగై దీవెనలు ఇచ్చేరో//2//..!
    రంగు రంగు పూలు ...

    ముద్ద పప్పు బతుకమ్మ చెప్పే ముచ్చట్లేన్నో
    ఎంగిలి బతుకమ్మ పంచే అనుభూతులెన్నో
    పప్పు , బెల్లం ,అటుకూలు తెచ్చినారురో
    అటుకుల బతుకమ్మ కి అర్పించినారురో..!
    పల్లేంత పండగలో మునిగితేలెరో
    బతుకమ్మ అండగై దీవెనలు ఇచ్చేరో//2//..!

    నానబియ్యం బతుకమ్మ నవ్వులెన్నో పంచినాది
    అట్ల బతుకమ్మ అమ్మలక్కల కష్టాలు తుంచినాది
    అలకల బతుకమ్మ ఇంట్లో వచ్చినాదిరో
    కోటి దీపాల వెలుగు నింపినాదిరో ..!
    పల్లేంత పండగలో మునిగితేలెరో
    బతుకమ్మ అండగై దీవెనలు ఇచ్చేరో//2//..!

    వెన్నెముద్ద బతుకమ్మ యెన్నెల కన్నా సల్లగున్నది
    వేపాకాయల బతుకమ్మ తీపి గుర్తులిచ్చినాది
    సద్దుల బతుకమ్మ ని చూసి మురిసినారురో
    పడుచు పిల్లా లెక్క సుద్దకి సాగదోలినారురో ..!
    పల్లేంత పండగలో మునిగితేలెరో
    బతుకమ్మ అండగై దీవెనలు ఇచ్చేరో//2//..!

    రంగు రంగు పూలు తేచ్చి
    పువ్వు మీద పువ్వు పేర్చి
    బతుకమ్మను ముస్తాబు చేసినారురో
    బంగారు బొమ్మ లెక్క చూసినారురో ..!

  • sindhe 18w

    ప్రకంపించు ప్రకంపించు
    భూకంపమై దాత్రిలా
    ప్రజ్వలించు ప్రజ్వలించు
    దహించే జ్యోతిలా
    మట్టికరిపించు మానవ మృగాలను మట్టికరిపించు
    నిన్ను తలిస్తే భయపడేలా ..

    రేగిపో రెగిపో చెలరేగిపో
    కామంధులను కడతెర్చే మహంకాళిలా
    సాగిపో సాగిపో కోనసాగిపో
    సమస్యలతో సమరం చేస్తు సైనికురాలిలా ..!

    ఏ ప్రభుత్వానికి వినబవు ని ఆర్థానాదాలు
    ఏ మీడియా చూపించదు ని మనసుకి తగిలిన గాయాలు
    ఏ చట్టం వచ్చినా ఆగవు నీపై అరచకాలు
    ఎవరికోసం ఇంకా ని ఎదురు చూపులు
    ఎవరి కోసం ఇంకా ని ఎదురు చూపులు
    ఎదురు తిరిగి చూడు వెనుకడుగెసెను ఆ కామమృగాలు

    రేగిపో రెగిపో చెలరేగిపో
    కామంధులను కడతెర్చే మహంకాళిలా
    సాగిపో సాగిపో కోనసాగిపో
    సమస్యలతో సమరం చేస్తు సైనికురాలిలా ..!

    కదనరంగంలో కత్తులు దువ్వినా
    రుద్రమ దేవి రక్తం నీది
    తెల్లదోరలను తరిమికోట్టినా
    మణికర్ణిక పుట్టిన నేల మనది
    నారివై వీర నారివై
    కాళివై మహంకాళి వై
    ఆ వింత జంతువుల ఆగడాలకు కట్టు సమాధి

    రేగిపో రెగిపో చెలరేగిపో
    కామంధులను కడతెర్చే మహంకాళిలా
    సాగిపో సాగిపో కోనసాగిపో
    సమస్యలతో సమరం చేస్తు సైనికురాలిలా ..!
    ✍️ Srikanth Sindhe

  • sindhe 18w

    నిక్కర్లు వేసుకున్న నుండి నీలావేణి
    ని వెంట చెక్కర్లు కోడుతున్న నీలావేణి
    కుక్కరు లెక్క అట్ట పోంగగే నీలావేణి
    ని ఫీకరు లా పడి అయ్యా పెషంటుని
    డాక్టరు ని కలిస్తే చెప్పిండే నువ్వే నా మెడిసిన్ అని
    కాస్తా కనుకరించి నయం చేయు నా లవ్ ఫీవరు ని

    నిక్కర్లు వేసుకున్న నుండి నీలావేణి
    ని వెంట చెక్కర్లు కోడుతున్న నీలావేణి
    కుక్కరు లెక్క అట్ట పోంగగే నీలావేణి
    ని ఫీకరు లా పడి అయ్యా పెషంటుని

    అ ఆ ఇ ఈ దిద్దిన నుండి నీలవేణి
    నీ చెతిలోనా వేశాను నా చేయిని
    ఏ బి సి డి పలికిన నుండి నీలవేణి
    అయ్యాను నేనె నీ బాడీ గాడు ని
    మూడో క్లాసులోనే నీలావేణీ
    మూడో క్లాసులోనే నీలావేణీ
    డిసైడ్ అయ్యా నీ మెడలో మూడు ముళ్లు వేయాలని

    నిక్కర్లు వేసుకున్న నుండి నీలావేణి
    ని వెంట చెక్కర్లు కోడుతున్న నీలావేణి
    కుక్కరు లెక్క అట్ట పోంగగే నీలావేణి
    ని ఫీకరు లా పడి అయ్యా పెషంటుని

    నా హర్టుపై టాటూగా వేసుకున్నా నీ పేరుని
    నీ హర్టులోనా ఇవ్వరాదే కూసింత చోటుని
    నీ ఫోటోస్ తోనె నింపేసా మా ఇంటి వాలుని
    నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కట్టెస్తా పెద్ద పెద్ద బ్యానర్లని
    కోట్ల ఆస్తులున్నా హ్యపినేస్ లేని పిల్లగాన్ని
    కోట్ల ఆస్తులున్నా హ్యపినేస్ లేని పిల్లగాన్ని
    నువ్వు ఏడడుగులు వేస్తే ఏలుతానే ఈ లోకాన్ని

    నిక్కర్లు వేసుకున్న నుండి నీలావేణి
    ని వెంట చెక్కర్లు కోడుతున్న నీలావేణి
    కుక్కరు లెక్క అట్ట పోంగగే నీలావేణి
    ని ఫీకరు లా పడి అయ్యా పెషంటుని
    ✍️ Srikanth Sindhe

  • sindhe 18w

    కంపించండి కంపించండి
    ధాత్రి లా కంపించండి
    జ్వలించండి జ్వలించండి
    జ్యోతి లా జ్వలించండి
    మట్టి కరిపించండి మానవ మృగాలను మట్టికరిపించండి
    జన్న జన్మలకు జడుసుకునేలా మట్టికరిపించండి..

    రేగిపోండి రేగిపోండి చెలరేగిపోండి
    కామాంధులను కడతేర్చె మహంకాళి లా చెలరేగిపోండి
    సాగిపోండి సాగిపోండి సాగిపోండి
    సమరం చేసె సైనికురాలిగా సమాజంతో సాగిపోండి ..!

    కదన రంగం లో కత్తులు దువ్వినా
    రుద్రమదేవి రుధిరం మీది
    తెల్లదోరలను తరిమికొట్టినా
    మణి కర్ణిక పుట్టిన పుడమి మనది
    నారిలై వీర నారిలై
    నరరూప రాక్షసులకు నరకం చూపించండి
    మీ తెగువ తో తప్పుడు కోడుకులా ఆట కట్టించడి

    రేగిపోండి రేగిపోండి చెలరేగిపోండి
    కామాంధులను కడతేర్చె మహంకాళి లా చెలరేగిపోండి
    సాగిపోండి సాగిపోండి సాగిపోండి
    సమరం చేసి ఆ సైనికురాలిగా సమాజంతో సాగిపోండి ..!

    ఏ ప్రభుత్వానికి వినబడవు మీ ఆర్థానాదాలు
    ఏ మీడియా కనబడవు మీ మనసుకైనా గాయాలు
    ఏ చట్టం వచ్చినా ఆగిపోవు మీపై ఆరాచాకాలు
    ఆడపిల్లలు కావాలి ఆటంబాంబులు
    అప్పుడే మీ దరిచేరవు ఏ కామ మృగాలు

    రేగిపోండి రేగిపోండి చెలరేగిపోండి
    కామాంధులను కడతేర్చె మహంకాళి లా చెలరేగిపోండి
    సాగిపోండి సాగిపోండి సాగిపోండి
    సమరం చేసి సైనికురాలిగా సమాజంతో సాగిపోండి ..!
    ✍️ Srikanth Sindhe

  • sindhe 18w

    గల్లీ గణేషున్ని చూడు భలే గమ్మత్తుగా ఉన్నాడు
    భాద్రపద మాసంలో పండగల వచ్చిండు
    బోజ్జా గణేశున్ని చూడు ముద్దు ముద్దుగా ఉన్నాడు
    వీధి వీధిలోనా వెలుగులే నింపినాడు
    వక్రతుండాయ నీకు కోటి దండలయ
    వక్రతుండాయ తండ్రి మా పైనే ఉంచు నీ దయ
    వక్రతుండాయ నీకు కోటి దండలయ
    వక్రతుండాయ తండ్రి మా పైనే ఉంచు నీ దయ..!

    విఘ్నాలకు అధిపతి నువ్వే గణేశా .. నువ్వే గణేశా
    మా లోనే భీతిని తోలిగించు గణేశా
    వి ..నాయకుడివి నువ్వే గణేశా
    విజయాలను కానుకగా అందివ్వు గణేశా
    ఏకా దంతుడివి నువ్వే గణేశా
    ఏకా దంతుడివి నువ్వే గణేశా
    మమ్ము ఇట్టాగే ఐక్యంగా ఉంచు హమేశా
    గం గం గణపతి గం గం గణపతి గం గం గణపతి
    అందుకో హారతి
    గం గం గణపతి గం గం గణపతి గం గం గణపతి
    ధూంధాం చేస్తాము పగలు రాత్రి...

    గల్లీ గణేషున్ని చూడు భలే గమ్మత్తుగా ఉన్నాడు
    భాద్రపద మాసంలో పండగల వచ్చిండు
    బోజ్జా గణేశున్ని చూడు ముద్దు ముద్దుగా ఉన్నాడు
    వీధి వీధిలోనా వెలుగులే నింపినాడు ...!

    భోళా శంకరుడి తనయుడవు గణేశా
    భోగా భాగ్యాలను ప్రసాదించు గణేశా
    పార్వతీ మాత కూమారుడవు గణేశా
    పాపులను దండిచి మమ్ము రక్షించు గణేశా
    గజ ముఖుడవవు నువ్వే గణేశా
    గజ ముఖుడవవు నువ్వే గణేశా
    ఈ జగము నే చల్లంగా ఉంచు హమేషా
    గం గం గణపతి గం గం గణపతి గం గం గణపతి
    అందుకో హారతి
    గం గం గణపతి గం గం గణపతి గం గం గణపతి
    ధూంధాం చేస్తాము పగలు రాత్రి..

    గల్లీ గణేషున్ని చూడు భలే గమ్మత్తుగా ఉన్నాడు
    భాద్రపద మాసంలో పండగల వచ్చిండు
    బోజ్జా గణేశున్ని చూడు ముద్దు ముద్దుగా ఉన్నాడు
    వీధి వీధిలోనా వెలుగులే నింపినాడు ..!
    ✍️ Srikanth Sindhe