మరుగు
"చూడాలని ఉంది నిన్ను చేరాలని ఉంది"!
మౌనమనే గోడను కూల్చి దూరమనే నీడను కాల్చి!!
"తాకాలని ఉంది నీ జత కూడాలని ఉంది"!
రాగమనే జతులను కూర్చి తానమనే గతులను చేర్చి!!
సరిగమల సరాగాలు ఏర్చి తీర్చి
ప్రతిఫలించు పల్లవుల పదనిసలు పేర్చి!!
చూడాలని ఉంది నిన్ను చేరాలని ఉంది!!!
కలహాల కలవరింతల కన్నీటి కావ్యాలు కార్చి
ముద్దు మురిపాల ముచ్చట్ల మరుగు మార్చి!!
తాకాలని ఉంది నీ జత కూడాలని ఉంది!!!
గాలి చూడని గానం గుండె గొంతు లోతున గాత్రం పెగల్చి
మాయమైన మోహం మరపును మది మాటున తట్టి మరల్చి!!
చూడాలని ఉంది నిన్ను చేరాలని ఉంది!!!
జరిగే కొద్దీ పెరిగే దూరం తరిగే ప్రయత్నమేదో చేసే హృదయ భారం తగ్గిచ్చి
ఏపుగ ఎదిగిన మనసు వృక్షం అడ్డుగ పెరిగిన అడ్డగోలు కొమ్మలు చీల్చి!!
#teluguvelugu
711 posts-
kalakruthi 2w
#మరుగు #telugu #teluguvelugu #mirakee

©kalakruthi -
kalakruthi 2w
#జత కూడగ #telugu #teluguvelugu #mirakee
ముగ్ధ మనోహర పూర్ణ బింబమున చల్లని కాంతుల జల్లులు కురవగ!
సుమధుర సుగంధ పరిమళ నిసిలో శశి జత కూడగ కలువ విరువగ!
నీలోత్పల ముఖకాంతి మెరయు విభుని రాకకై 'నీరజ' నులి సిగ్గుల నిరీక్షించగ!
శేషతల్పమున నాదశ్వర శ్వాసామృత ఝరిలో 'పంకజనాభుడు' మయమరచి సేద తీరగ!
ఎదురు చూపుల బేల, 'వారిజ' వెలవెల మని
విరసంబున గడుసుగ 'హూంకరించగ'..!
పెళ పెళ మని దిక్కులు పిక్కటిల్ల, క్షీరాబ్దిన ఉవ్వెత్తుగ తరంగములదరగ!
గుండె ఝల్లుమని ఉలుకున లేచెను 'శౌరి' తటిల్లున, 'సరసిజ' ఎడబాటు నెరిగి తన ఎద గబగబ చేరగ...!!!
©kalakruthiజత కూడగ

kalakruthi 5w
#పొరపాటు #telugu #teluguvelugu #mirakee
ఓర చూపుల వయ్యారి చిలిపి నవ్వుల చిన్నారి!
అలుపెరుగని ప్రయాణంలో ఆగి చోద్యం చూడమాకే!!
నీ చూపు వెనకే వేచి చూసే దిగులు ఏమిటో చెప్పవే!
నీ పెదవి విరుపున దాగి వున్న గుబులు గుట్టే విప్పవే!!
అందమైన మనసు మూలన మలినమేదో మాటువేసే!
కలికి కులుకుల తీపి పలుకుల వ్యాఘ్రమై వేటచేసే!!
విరి కురులు ముసిరి మరులు విసిరి తెలుపు నలుపై చీకటై!
సిరి ఒంటి వెలుగులు కంటి మెరుపులు కాంతులై సురకాంతలై!!
చెవి రెమ్మలంచున, ముకు కాడ చివరన మొలచి మురిసిన తడి వజ్రమై!
కనుబొమల ముంగిట, అధరాల సందిట జీర్ణమైన వర్ణమై!!
కుతుక క్రిందుగ మది మందిరానికి దారి చూపే చక్కనైన పుట్టుమచ్చై!
నెచ్చెలి! నెల్లప్పుడు నిన్నంటిపెట్టుకు నేనుండగ...ఎదమాటు పొంగే దుఃఖమేల, పొరపాటు నీదని చింతయేల!!!©kalakruthiపొరపాటు

నెచ్చెలి! నెల్లప్పుడు నిన్నంటిపెట్టుకు నేనుండగ... ఎదమాటు పొంగే దుఃఖమేల, పొరపాటు నీదని చింతయేల!!!©kalakruthi -

#పాషాణమ #teluguvelugu #telugu #mirakee
హాసమా,దరహాసమా, అది నీ పరిహాసమ!
కఠినమా, జఠిలమా, మనసే పాషాణమ!!
కదల్లేని మెదల్లేని మొదలు నరికిని మానువ!
కనలేని వినలేని సగం చచ్చిన మనిషివ!!
స్పృహలో వుండే నువ్విటు నడిచావ!
స్మృతి రాహిత్యంతో నడకే మరిచావ!!
ప్రేమను పంచిన చేతులతో జీవ నాడినే తుంచావ!
జీవం పోసిన ఆత్మీయతనే కత్తికో కండగ నరికావ!!
అభిమానపు శవాల గుట్టలపై హార్మ్యాలే కట్టావ!
అత్యాశలు ప్రకోపించి అనుబంధాల శిఖరాలే కూల్చావ!!
హాసమా,దరహాసమా, అది నీ పరిహాసమ!
కఠినమా, జఠిలమా, మనసే పాషాణమ!!
©kalakruthiపాషాణమ

kalakruthi 7w
#'ప్రకృతి'
ప్రకృతి పులకరించి పలకరించే క్షణం 'మేఘాలు వర్షించి భూదేవికి తలస్నానాలు చేయిస్తాయి'!
ప్రకృతి పులకరించి పలకరించే క్షణం 'రుతుపవనాలు ముందుకురికి వనకన్యక అలసట తీరుస్తాయి'!
ప్రకృతి పులకరించి పలకరించే క్షణం 'హిమశిఖరాలు తలలువూపి మంచు పుష్పాలతో గిరిపుత్రిని పూజిస్తాయి'!
ప్రకృతి పులకరించి పలకరించే క్షణం 'సాగర కెరటాలు ఉవ్వెత్తున పైకెగసి సంయమనంతో సుకుమారి పాదాలు ముద్దాడతాయి'!
'ప్రకృతి' పులకరించి 'పరవసించే' క్షణం పురుషుని బిగికౌగిట జేరి ఒదిగిపోయి కలిసిపోయి కరిగిపోతుంది...!!!
©kalakruthi
#telugu #teluguvelugu #mirakee'ప్రకృతి'

kalakruthi 8w
#గమ్మత్తుగ
తిక్కదనాల చక్కని చుక్క కోపం వీడవే,
అలగటమెరుగని మల్లెమొగ్గ తాపం చూడవే!
నీ వాదులాటలో వర్ణం మారును కీచులాటలో కసి బయలిడును,
భావం తెలియని భావోద్వేగం బర బర పరుగిడి వురకలేయును!
కినుకుమాని నా మనసు చూడవే,
పట్టువీడి నీ ఒడిలో చేర్చవే!
తప్పులెంచుటే పరిపాటైతే బిక్కచచ్చి నే బిగుసుకుపోనా,
కలవరమెరుగని ఉక్కుమనిషినే నీ సెగ తగిలితే కరిగేపోనా!
పంతాలు పట్టింపులు మనకు కొత్త కాదులే,
హద్దులు లేని మన ప్రేమకి అవి అడ్డు రావులే!
నిద్ర లేచుకుని ఒళ్ళు విరుచుకుని మత్తువీడి గమ్మత్తుగ చూడవే నా వైపు,
రెప్పైనా ఆర్పక చూస్తూనే వున్నా నీ వైపు, నే చూస్తూనే వున్నా నీ వైపు...!!! ©kalakruthi
#telugu #teluguvelugu #mirakeeగమ్మత్తుగ
తిక్కదనాల చక్కని చుక్క కోపం వీడవే,
అలగటమెరుగని మల్లెమొగ్గ తాపం చూడవే!
నీ వాదులాటలో వర్ణం మారును కీచులాటలో కసి బయలిడును,
భావం తెలియని భావోద్వేగం బర బర పరుగిడి వురకలేయును!
కినుకుమాని నా మనసు చూడవే,
పట్టువీడి నీ ఒడిలో చేర్చవే!
తప్పులెంచుటే పరిపాటైతే బిక్కచచ్చి నే బిగుసుకుపోనా,
కలవరమెరుగని ఉక్కుమనిషినే నీ సెగ తగిలితే కరిగేపోనా!
పంతాలు పట్టింపులు మనకు కొత్త కాదులే,
హద్దులు లేని మన ప్రేమకి అవి అడ్డు రావులే!
నిద్ర లేచుకుని ఒళ్ళు విరుచుకుని మత్తువీడి గమ్మత్తుగ చూడవే నా వైపు,
రెప్పైనా ఆర్పక చూస్తూనే వున్నా నీ వైపు...!!!
©kalakruthi -
kalakruthi 8w
#బింకంగ
మాటల్లో చెప్పలేని బాధేదో నన్ను మింగేస్తోందే నమిలి మింగేస్తోంది!
వెతికినా కనిపించని నొప్పేదో భాదిస్తోందే నన్ను చీల్చి పారేస్తోంది!
జవాబు లేని ప్రశ్నేదో గోంతు ఒత్తేస్తోందే పిల్లా పీక పిసికేస్తోంది...!!
కళ్ళు మూసుకుని వున్నా మనసు నిద్రపోనంది
మూసి వున్న కళ్ళ నుంచి ఉబికిరాక ఆగనంది!
బింకంగా ఆత్రంగా అహం బాధని మింగేసింది
ఎంత దాచినా దాగక బయటకు కక్కేసింది!
ప్రశ్నించే ప్రేమని చూసి మొహం దాచేసింది
తప్పు తెలుసుకున్నా ఒప్పక తలదించుకు నిలిచింది...!!!
©kalakruthi
#telugu #teluguvelugu #mirakeeబింకంగ
మాటల్లో చెప్పలేని బాధేదో నన్ను మింగేస్తోందే నమిలి మింగేస్తోంది!
వెతికినా కనిపించని నొప్పేదో భాదిస్తోందే నన్ను చీల్చి పారేస్తోంది!
జవాబు లేని ప్రశ్నేదో గోంతు ఒత్తేస్తోందే పిల్లా పీక పిసికేస్తోంది...!!
కళ్ళు మూసుకుని వున్నా మనసు నిద్రపోనంది
మూసి వున్న కళ్ళ నుంచి ఉబికిరాక ఆగనంది!
బింకంగా ఆత్రంగా అహం బాధని మింగేసింది
ఎంత దాచినా దాగక బయటకు కక్కేసింది!
ప్రశ్నించే ప్రేమని చూసి మొహం దాచేసింది
తప్పు తెలుసుకున్నా ఒప్పక తలదించుకు నిలిచింది...!!! ©kalakruthi -
kalakruthi 8w
#పదనిస
తొలకరి జల్లుల చిరు చలిలో
దుప్పటి ముసుగుల గుసగుసలు!
కదిలే చేతుల పదనిసలో
కిల కిల నవ్వుల సరిగమలు!
వీచే గాలుల గిలి గిలిలో
రాపిడి మంటల ఉష్ణములు!
కుదురుగ ఎగసే శ్వాసలలో
నవ్వుతు అదిరే అధరములు!
ప్రియముగ చూసే చూపులలో
తొణికిసలాడే ఇరు భావములు...!!
©kalakruthi
#telugu #teluguvelugu #mirakeeపదనిస
తొలకరి జల్లుల చిరు చలిలో
దుప్పటి ముసుగుల గుసగుసలు!
కదిలే చేతుల పదనిసలో
కిల కిల నవ్వుల సరిగమలు!
వీచే గాలుల గిలి గిలిలో
రాపిడి మంటల ఉష్ణములు!
కుదురుగ ఎగసే శ్వాసలలో
నవ్వుతు అదిరే అధరములు!
ప్రియముగ చూసే చూపులలో
తొణికిసలాడే ఇరు భావములు...!!
©kalakruthi -
kalakruthi 10w
#విచిత్రమే #telugu #teluguvelugu #mirakee
నవమాసాలు నిఘూఢ ఘాడ ద్రవ నిసిలో స్తబ్ధుగ మసలి,
నిత్య నూతన నవ్యతల కినుకున మెల మెల్లగ రూపు దాల్చి,
నువ్వు గింజే... శత సహస్ర చీలికలై రూప రూపాంతరముల జలపుష్పమై, భేకమై, సరీసృపమై, విహంగమై, వానరమై తుదకు నవజాత శిశువై బయల్పడి,
క్షుత్పిపాసన రోదించి, తల్లి యదపై పారాడి చనుబాలు గుడిచి,
గమ్మున మంద స్మితమున ఒడిలో సేద తీరు తీరే....!
బహు చిత్రమే, భళారే ఈ సృష్టి విచిత్రమే !!!
©kalakruthiవిచిత్రమే

kalakruthi 12w
#వికృత క్రీడ
నా ప్రేమని తట్టుకునే శక్తి నీకు లేదే !
నా చెలిమిని నిలుపుకునే కూరిమి కానరాదే !!
నా స్నేహం గెలుచుకునే సమయం మరల నీకు రాదే !
నా విలువలు పంచుకునే సంయమనం చూడలేదే !!
అభిమానం వెల్లివిరిసి అనురక్తిగ మారి,
అనురాగపు ఆ బంధం ప్రణయ గీతి పాడి,
అంబరమున ఆశల ఉయ్యాలలే ఊగి,
అలుపన్నది లేక ప్రేమ నిరంతరం సాగి...!
ఆఖరకు, యదపై ఆశనిపాతమై హిమసంపాతమై, అగాధాల అంచులలో గొంతే నులిమి...! మనసే తురిమి...!
కరుకు మాటల బండ రాళ్ళు విసిరి,
విరసపు చేష్టల వికృత క్రీడలాడి...!
అందలాల ఆకర్షణలు అవకాశాల ఆపేక్షలు... నీ అంతరాత్మ ఆత్మఘోషై, ఆత్మీయత పీక పిసికి హత్య చేసి... ఇది ఆత్మహత్యేనని అంటుంటే...!
©kalakruthi
#telugu #teluguvelugu #mirakeeవికృత క్రీడ
నా ప్రేమని తట్టుకునే శక్తి నీకు లేదే !
నా చెలిమిని నిలుపుకునే కూరిమి కానరాదే !!
నా స్నేహం గెలుచుకునే సమయం మరల నీకు రాదే !
నా విలువలు పంచుకునే సంయమనం చూడలేదే !!
అభిమానం వెల్లివిరిసి అనురక్తిగ మారి,
అనురాగపు ఆ బంధం ప్రణయ గీతి పాడి,
అంబరమున ఆశల ఉయ్యాలలే ఊగి,
అలుపన్నది లేక ప్రేమ నిరంతరం సాగి...!
ఆఖరకు, యదపై ఆశనిపాతమై హిమసంపాతమై, అగాధాల అంచులలో గొంతే నులిమి...! మనసే తురిమి...!
కరుకు మాటల బండ రాళ్ళు విసిరి,
విరసపు చేష్టల వికృత క్రీడలాడి...!
అందలాల ఆకర్షణలు అవకాశాల ఆపేక్షలు... నీ అంతరాత్మ ఆత్మఘోషై, ఆత్మీయత పీక పిసికి హత్య చేసి... ఇది ఆత్మహత్యేనని అంటుంటే...!!! ©kalakruthi -
dinakarreddy 16w
అక్కడా ఇక్కడా
అక్కడా ఇక్కడా
చిత్తు పేపర్ల మీద వ్రాసుకుంటూ
చిత్తు పేపర్లను కూడా వదలకుండా చదువుకుంటూ..
నే నన్ను మరచిపోయాను.
©dinakarreddy -
kalakruthi 19w
#కోమలి
కళగల ముఖమున తీరుగ కుంకుమ దిద్ది, 'ఆ భానుని ఏమార్చి'..!
చిరునగవు పెదవంచున చిలిపిగ దాల్చి, 'ఆ చంద్రుని ఎగతాళి జేసి'..!
మిలమిల మెరయు కాటుక కనులు రెపరెపలార్చి, 'ఆ తారల సిగ్గుదీసి'..!
నల నల్లని విరి కురుల కూర్చి, 'కారుజీకటిని బేజారు పరచి'..!
నున్నని నాసికన మెరయు పుడక దూర్చి, 'నలుదిక్కుల సరిదారి జూపి'..!
కనుబొమల అలలపై సరిగమలు పేర్చి, 'సరాగాలు తీర్చి'..!
చెవి తమ్మెల జారు, ధగ ధగల దుద్దులతో, 'విద్యుల్లతామెరుపుల సమరించి'..!
ఔరా! ఈ కోమలి తన ముగ్ధమనోహర సోయగముతో ప్రకృతినే సవాలు జేసెనే...!!!©kalakruthi
#telugu #teluguvelugu #mirakeeకోమలి
కళగల ముఖమున తీరుగ కుంకుమ దిద్ది, 'ఆ భానుని ఏమార్చి'..!
చిరునగవు పెదవంచున చిలిపిగ దాల్చి, 'ఆ చంద్రుని ఎగతాళి జేసి'..!
మిలమిల మెరయు కాటుక కనులు రెపరెపలార్చి, 'ఆ తారల సిగ్గుదీసి'..!
నల నల్లని విరి కురుల కూర్చి, 'కారుజీకటిని బేజారు పరచి'..!
నున్నని నాసికన మెరయు పుడక దూర్చి, 'నలుదిక్కుల సరిదారి జూపి'..!
కనుబొమల అలలపై సరిగమలు పేర్చి, 'సరాగాలు తీర్చి'..!
చెవి తమ్మెల జారు, ధగ ధగల దుద్దులతో, 'విద్యుల్లతామెరుపుల సమరించి'..!
ఔరా! ఈ కోమలి తన ముగ్ధమనోహర సోయగముతో ప్రకృతినే సవాలు జేసెనే...!!!©kalakruthi -
kalakruthi 20w
#లే..నిదుర లే
బ్రతకడానికైతే బ్రతికేయ్...!
బ్రతుకు సమరంలో సమిధవై కాలిపోకముందే,
ఎదగడానికైతే ఎదిగేయ్...!
ఎత్తుల పైఎత్తుల కుయుక్తుల ఊబిలోకి జారకముందే,
గెలవడానికైతే గెలిచేయ్...!
గెలుపోటముల గీత, గాడి తప్పించావని గేలి చేయకముందే,
నీ నవ్వుల పువ్వులలో దాగున్నది నగుబాటైతే... 'దాచేయ్' నవ్వు దాచేయ్ !
నీ నోటి మాటల మిఠాయి మూటలలో మాటున్నది ముసలమైతే... 'మూసేయ్' నోరు మూసేయ్ !
నీ కనుల కాంతుల కావల కాపున్నది కపట క్రీనీడైతే... 'పొడిచేయ్' కళ్ళు పొడిచేయ్ !
నీ నవ్వుల పువ్వుల, మాటల మూటల, కనుల కాంతుల... కుళ్ళంతా వూరి వూరి భళ్ళున బద్దలై, నిను కాలకూటమై కమ్మేయకముందే, తాపీగా నిను హరించి తరించకముందే... లే..లే నిదుర లే...!!!
©kalakruthi
#teluguvelugu #mirakee #teluguలే..నిదుర లే

#శూన్యమై
"పగలంతా తడిసినా
పనిచేతుల ఒడిసినా"
ఆహారం మితమాయే,
ఆహార్యం మారదాయే,
ఒత్తిడేమొ వరదాయే !!
"రోజంతా కూడినా
ఎదురీదుతు ఓడినా"
తీరనిదీ దాహమాయే,
దేహమంత పులిసిపోయే,
మనసేమొ అలసిపోయే !!
"లెక్కలెన్నొ వేసినా
నేలవిడిచి ఎగిరినా"
సమయమే ఆగదాయే,
కనిపిస్తూ దూరమాయే,
అందొస్తూ జారిపోయే !!
"అడుగెనుకకు వేసినా
వెనుదిరిగీ చూసినా"
కాలమేమొ కరిగిపోయే,
ప్రేమంతా మురిగిపోయే,
శూన్యమై చేరువాయే !!!
©kalakruthi
#telugu #teluguvelugu #mirakeeశూన్యమై
"పగలంతా తడిసినా
పనిచేతుల ఒడిసినా"
ఆహారం మితమాయే,
ఆహార్యం మారదాయే,
ఒత్తిడేమొ వరదాయే !!
"రోజంతా కూడినా
ఎదురీదుతు ఓడినా"
తీరనిదీ దాహమాయే,
దేహమంత పులిసిపోయే,
మనసేమొ అలసిపోయే !!
"లెక్కలెన్నొ వేసినా
నేలవిడిచి ఎగిరినా"
సమయమే ఆగదాయే,
కనిపిస్తూ దూరమాయే,
అందొస్తూ జారిపోయే !!
"అడుగెనుకకు వేసినా
వెనుదిరిగీ చూసినా"
కాలమేమొ కరిగిపోయే,
ప్రేమంతా మురిగిపోయే,
శూన్యమై చేరువాయే !!! ©kalakruthi -
kalakruthi 21w
#నీ చూపు
కాటుక కళ్ళ చిన్నదానా కరుకైన నీ చూపూ...!
పూ రేకులకన్నా సున్నితమై తాకెనులే అది నన్నూ...!
నులి వెచ్చని ఎత్తుల జిత్తులలో పడిలేచెను నా మనసు...!
సుకుమారీ, ఏది దారి నిను చేరగ వగచే ఈ హృదికి...!
కిక్కురుమనక కయ్యమొద్దని గమనిస్తూ గమ్మున ఉన్నాలే...!
లే లెమ్మని అరిచే అంతరంగం, అలిగిందే అర్ధమెరిగీ వీడలేదని నీ జట్టు...!
టూకీగా చెప్పాలంటే పిల్లా,చిక్కానే మాయలో, చిరుగాలో పిల్లగాలో తగిలి జారిందే ఖలేజా...!
జల్లికట్టులో అలవోకగా పోటుగిత్తను వంచిన కండల కైపే కరిగిందే, నీ చూపుల మెరుపులు తాకాక...!
కాటుక కళ్ళ చిన్నదానా కరుకైన నీ చూపూ...
పూ రేకులకన్నా సున్నితమై తాకెనులే అది నన్నూ...!!!
©kalakruthi
#telugu #teluguvelugu #mirakeeనీ చూపు
కాటుక కళ్ళ చిన్నదానా కరుకైన నీ చూపూ...!
పూ రేకులకన్నా సున్నితమై తాకెనులే అది నన్నూ...!
నులి వెచ్చని ఎత్తుల జిత్తులలో పడిలేచెను నా మనసు...!
సుకుమారీ, ఏది దారి నిను చేరగ వగచే ఈ హృదికి...!
కిక్కురుమనక కయ్యమొద్దని గమనిస్తూ గమ్మున ఉన్నాలే...!
లే లెమ్మని అరిచే అంతరంగం, అలిగిందే అర్ధమెరిగీ వీడలేదని నీ జట్టు...!
టూకీగా చెప్పాలంటే పిల్లా,చిక్కానే మాయలో, చిరుగాలో పిల్లగాలో తగిలి జారిందే ఖలేజా...!
జల్లికట్టులో, అలవోకగా పోటుగిత్తను వంచిన కండల కైపే కరిగిందే నీ చూపుల మెరుపులు తాకాక...!
కాటుక కళ్ళ చిన్నదానా కరుకైన నీ చూపూ...
పూ రేకులకన్నా సున్నితమై తాకెనులే అది నన్నూ...!!!©kalakruthi -
ఎన్నో భావాలు నీ మౌనంలో
ఎన్నో కధనాలు నీ కనులలో
ఎన్నో ఊహలు నీ మదిలో
ఎన్నో ఆశయాలు నీ ఆలోచనలలో
మరెన్నో సంతోషాలు నీ కదలికలో
©smileysoul -
రెక్కలు వచ్చి ఎగిరిపోతున్న
కాలంతోబాటు కలల తీరాలను
మూగబోయిన భావాలను
తరిమే సంఘర్షణలు
కళ్లను చెమర్చే సందర్భాలెన్నో
©smileysoul -
లేత కిరణాలు తాకి
కుసుమాలు విరిసిన వేళ
చల్లని గాలి నులివెచ్చగా తాకిన వేళ
కను పాపాలు నిద్ర వీడీన వేళ
శుప్రభాతాలు శ్రవణాలను చేరిన వేళ
కొత్త నేటికి కొంగొత్త కోరికలు పుట్టి వాటి వెంట పరుగులు తీసే జాగరణల జాబిల్లి బాల
©smileysoul -
చెదరని నవ్వు
చెదిరిన జీవితం
కరగని మౌనం
కదిలే కాలం
మరువలేని క్షణాలు
మారుతున్నా మనుషులు
వదలని జ్ఞాపకాలు
వెంటతెస్తూన్న కారాగారాలు
©smileysoul